Surya’s Trible role In 24?
Posted on: Jun 12, 2015
తెలుగు , తమిళ్ ఇలా రెండు బాషలలో తనకంటూ ఓ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య..తాజాగా ‘త్రిపాత్రాభినయం’ లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ద్విపాత్రాభినయం పాత్రలో అలరించిన సూర్య మొదటిసారిగా ‘త్రిపాత్రాభినయం’ చేస్తున్నాడు అనే వార్త ఫిలిం నగర్ లో ఆసక్తిగా మారింది.
సూర్య నటిస్తున్న తాజా చిత్రం ’24’ ప్రాజెక్ట్ లో మూడు పాత్రలలో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే సూర్య కు జోడిగా సమంత నటిస్తుంది.