The Cine Bay

 
FB Twitter

Ram’s Shivam completes Ooty schedule!!

News - Ram’s Shivam Completes Ooty Schedule!! ఇటీవలే 'పండగ చేస్కో' అంటూ ప్రేక్షకులు పండగ చేసుకునే సినిమా ఇచ్చిన రామ్ ప్రస్తుతం మరో రెండు విజయవంతమైన చిత్రాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఒకటి 'శివం'. మరోటి 'హరికథ' (వర్కింగ్ టైటిల్). ఈ రెండు చిత్రాల్లో ప్రస్తుతం రామ్ 'శివం' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. శ్రీనివాసరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఈ చిత్రవిశేషాలను 'స్రవంతి' రవికిశోర్ తెలియజేస్తూ - ''ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. ఈ చిత్రంలో రామ్ పాత్ర చిత్రణ చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాస్, మాస్ ని ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. మే 26 నుంచి ఈ నెల 12 వరకూ హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ జరిపాం. ఈ నెల 12న ఊటీలో ఓ షెడ్యూల్ ప్రారంభించి, వారం రోజుల పాటు చిత్రీకరణ జరిపాం. దీంతో 70 శాతం టాకీ, క్లయిమ్యాక్స్ పూర్తయ్యాయి. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరీ అని, సినిమా బాగా వస్తోందని రామ్ అన్నారు. బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ  ప్రసాద్, కెమెరా: రసూల్, ఫైట్స్: పీటర్ హేన్స్, సమర్పణ: కృష్ణచైతన్య.   Ram’s Shivam completes Ooty schedule!!
> >
Ram’s Shivam Completes Ooty Schedule!!

Ram’s Shivam completes Ooty schedule!!

Posted on: Jun 22, 2015

ఇటీవలే 'పండగ చేస్కో' అంటూ ప్రేక్షకులు పండగ చేసుకునే సినిమా ఇచ్చిన రామ్ ప్రస్తుతం మరో రెండు విజయవంతమైన చిత్రాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఒకటి 'శివం'. మరోటి 'హరికథ' (వర్కింగ్ టైటిల్). ఈ రెండు చిత్రాల్లో ప్రస్తుతం రామ్ 'శివం' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. శ్రీనివాసరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక.
ఈ చిత్రవిశేషాలను 'స్రవంతి' రవికిశోర్ తెలియజేస్తూ - ''ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. ఈ చిత్రంలో రామ్ పాత్ర చిత్రణ చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాస్, మాస్ ని ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. మే 26 నుంచి ఈ నెల 12 వరకూ హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ జరిపాం. ఈ నెల 12న ఊటీలో ఓ షెడ్యూల్ ప్రారంభించి, వారం రోజుల పాటు చిత్రీకరణ జరిపాం. దీంతో 70 శాతం టాకీ, క్లయిమ్యాక్స్ పూర్తయ్యాయి. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇది హై ఓల్టేజ్ లవ్ స్టోరీ అని, సినిమా బాగా వస్తోందని రామ్ అన్నారు.

బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ  ప్రసాద్, కెమెరా: రసూల్, ఫైట్స్: పీటర్ హేన్స్, సమర్పణ: కృష్ణచైతన్య.

 

Comments