The Cine Bay

 
FB Twitter

Rajamouli About Kanche movie !!

News - Rajamouli About Kanche Movie !! ‘కంచె’ గ్యారంటీగా పెద్ద కమర్షియల్ హిట్ మూవీగా నిలుస్తుంది – ఎస్.ఎస్.రాజమౌళి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ''క్రిష్ ను ఎక్కువగా పొగేస్తుంటాను. అందుకే ఆయన ఫంక్షన్ కి రావాలంటే చిన్న భయం కూడా ఉంటుంది. ఒక సినిమాని బాగా తీయాలంటే ప్యాషన్‌, డేడికేషన్‌, రైట్ యాట్యిట్యూడ్‌ ఉండాలి. ఇవన్నీ ఎక్కువగా ఉన్న దర్శకుడు క్రిష్‌. తను కంచె సినిమా డైరెక్ట్ చేయడం ఫెంటాస్టిక్. సినిమా అంటేనే ఆడియెన్స్ ను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే సాధనం. అటువంటి అడ్వాంటేజ్ పీరియడ్ సినిమాల్లో కాస్తా ఎక్కువగా ఉంటుంది. కానీ అలా తీసుకెళ్లడం చాలా కష్టం. ట్రైలర్‌ చూస్తుంటే కాస్ట్యూమ్స్, డ్రస్, బాటిల్ ట్యాంక్ తయారు చేయాలన్న ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకు చాలా డేడికేషన్ ఉండాలి. టీమ్‌ పడ్డ కష్టం తెలుస్తుంది. ట్రైలర్‌లోని ఫస్ట్ షాట్ ట్యాంకర్‌ షాట్‌ చూడగానే నాకు ఒళ్ళు జల్లుమనిపించింది. ఒక ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ వస్తుందని నాకు అర్థమైంది.  క్రిష్‌ సినిమాలకు మంచి క్రిటికల్‌ అక్లెయిమ్‌ వస్తుంది. కానీ తనకి నిజమైన కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు. ఆ కంచెను ఈ కంచె దాటుతుంది, పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనే ఫీలింగ్‌ ట్రైలర్‌ చూడగానే వచ్చింది. ఇక వరుణ్ గురించి చెప్పాలంటే , వరుణ్ కే కాదు, ఏ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోస్‌ ఎంత పెద్ద వరమో అంతే పెద్ద శాపం కూడా అని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా రకాలైన పోలికలు, చాలా రకాలైన సలహాలిస్తుంటారు. అలాంటి సలహాలు వరుణ్‌కి చాలా వచ్చుంటాయని అనుకుంటున్నాను. చరణ్‌లా ఫైట్స్‌ చేయాలి, బన్నిలా డ్యాన్సులు చేయాలి, పవన్ లా స్టయిల్ చూపించాలనే సలహాలిస్తుంటారు. అయితే వరుణ్‌ ఎవరినీ ఫాలో కాకుండా మెగా ఫ్యామిలీ నుండి రావడం ఆశీర్వాదంగా తీసుకుని తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకోవాలని నా సలహా. ఇప్పుడు వరుణ్‌ కూడా అదే చేస్తున్నాడని తన ఎంచుకుంటున్న సినిమాలు, యాక్టింగ్ స్టయిల్ చూస్తుంటే డిఫరెంట్ గా ఉంది. క్రిష్, వరుణ్‌ అండ్‌ టీమ్‌కి కంగ్రాట్స్‌. ట్రైలర్‌ చూస్తుంటే గ్యారంటీ హిట్‌ అని తెలుస్తుంది'’ అన్నారు. Rajamouli About Kanche movie !!
> >
Rajamouli About Kanche Movie !!

Rajamouli About Kanche movie !!

Posted on: Sep 02, 2015

కంచె గ్యారంటీగా పెద్ద కమర్షియల్ హిట్ మూవీగా నిలుస్తుంది – ఎస్.ఎస్.రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ''క్రిష్ ను ఎక్కువగా పొగేస్తుంటాను. అందుకే ఆయన ఫంక్షన్ కి రావాలంటే చిన్న భయం కూడా ఉంటుంది. ఒక సినిమాని బాగా తీయాలంటే ప్యాషన్‌, డేడికేషన్‌, రైట్ యాట్యిట్యూడ్‌ ఉండాలి. ఇవన్నీ ఎక్కువగా ఉన్న దర్శకుడు క్రిష్‌. తను కంచె సినిమా డైరెక్ట్ చేయడం ఫెంటాస్టిక్. సినిమా అంటేనే ఆడియెన్స్ ను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే సాధనం. అటువంటి అడ్వాంటేజ్ పీరియడ్ సినిమాల్లో కాస్తా ఎక్కువగా ఉంటుంది. కానీ అలా తీసుకెళ్లడం చాలా కష్టం. ట్రైలర్‌ చూస్తుంటే కాస్ట్యూమ్స్, డ్రస్, బాటిల్ ట్యాంక్ తయారు చేయాలన్న ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకు చాలా డేడికేషన్ ఉండాలి. టీమ్‌ పడ్డ కష్టం తెలుస్తుంది. ట్రైలర్‌లోని ఫస్ట్ షాట్ ట్యాంకర్‌ షాట్‌ చూడగానే నాకు ఒళ్ళు జల్లుమనిపించింది. ఒక ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ వస్తుందని నాకు అర్థమైంది.  క్రిష్‌ సినిమాలకు మంచి క్రిటికల్‌ అక్లెయిమ్‌ వస్తుంది. కానీ తనకి నిజమైన కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు. ఆ కంచెను ఈ కంచె దాటుతుంది, పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనే ఫీలింగ్‌ ట్రైలర్‌ చూడగానే వచ్చింది. ఇక వరుణ్ గురించి చెప్పాలంటే , వరుణ్ కే కాదు, ఏ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోస్‌ ఎంత పెద్ద వరమో అంతే పెద్ద శాపం కూడా అని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా రకాలైన పోలికలు, చాలా రకాలైన సలహాలిస్తుంటారు. అలాంటి సలహాలు వరుణ్‌కి చాలా వచ్చుంటాయని అనుకుంటున్నాను. చరణ్‌లా ఫైట్స్‌ చేయాలి, బన్నిలా డ్యాన్సులు చేయాలి, పవన్ లా స్టయిల్ చూపించాలనే సలహాలిస్తుంటారు. అయితే వరుణ్‌ ఎవరినీ ఫాలో కాకుండా మెగా ఫ్యామిలీ నుండి రావడం ఆశీర్వాదంగా తీసుకుని తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకోవాలని నా సలహా. ఇప్పుడు వరుణ్‌ కూడా అదే చేస్తున్నాడని తన ఎంచుకుంటున్న సినిమాలు, యాక్టింగ్ స్టయిల్ చూస్తుంటే డిఫరెంట్ గా ఉంది. క్రిష్, వరుణ్‌ అండ్‌ టీమ్‌కి కంగ్రాట్స్‌. ట్రైలర్‌ చూస్తుంటే గ్యారంటీ హిట్‌ అని తెలుస్తుంది'’ అన్నారు.

Comments