The Cine Bay

 
FB Twitter

Great Response For Varantej Kanche Trailer!!

News - Great Response For Varantej Kanche Trailer!! 'కంచె' ట్రైలర్‌ విడుదల మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు.  ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 1, మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, మెగాబ్రదర్ నాగబాబు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం ఏర్పాటైన సమావేశంలో....   ‘గమ్యం’ తర్వాత నేను చేసిన గొప్ప కథ ‘కంచె’- క్రిష్ జాగర్లమూడి                 డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి మాట్లాడుతూ ‘’ఒక కథను చెప్పాలంటే బలంగా చెప్పాలనుకునే వ్యక్తిని నేను. ఓ కథను రాసుకోవాలంటే కొంత టైమ్, తీయడానికి మరికొంత టైమ్ పడుతుంది. అలాగే కథను నేను దాదాపు మూడు సంవత్సరాలుగా క్యారీ చేశాను. ప్రపచంలో జరిగిన గొప్పయుద్ధాల్లో గొప్పది రెండో ప్రపంచ యుద్ధం కానీ 75 సంవత్సరాలుగా ఇటువంటి కథతో తెలుగు, తమిళంలో సినిమాలు రాలేదు. ఈ కథ రాసుకున్నప్పుడు ఎవరూ ఈ విధంగా పెర్‌ఫార్మన్స్‌ చేస్తారోనని అనుకునేవాడిని. ఎందుకంటే హీరో సోల్జర్‌గా ఉండాలి. అమాయకత్వంతో, తెలియని తెంపరితనంతో కూడుకుని ఉండాలి. 1936లో చెన్నపట్నంలో చదువుకున్న విద్యార్థిలా ఉండాలి. కానీ దేవుడి దయ, ప్రకృతి అంతా కలిసి నాకు ఇవ్వడమో ఏమో కానీ కథకు కావాల్సినవన్నీ ఆటోమెటిక్ గా సమకూరాయి. బడ్జెట్, హీరో, హీరోయిన్ ఇంకేదైనా కావచ్చు. ఈ సినిమాని నిడిని రెండు గంటల ఐదు నిమిషాల సినిమా. గమ్యం తర్వాత గొప్ప కథ నాకు దొరికింది. దాన్ని బాగా ఎగ్జిక్యూట్‌ చేశామని అనుకుంటున్నాం. చాలా సంవత్సరాలు తర్వాత థియేటర్స్ కి బాహుబలి వల్ల ఆడియెన్స్ బండ్లు కట్టుకుని వస్తున్నారు. ఆ తర్వాత  శ్రీమంతుడు కూడా పెద్ద హిట్టయింది. అదే కోవలో మా కంచె సినిమా కూడా చేరాలి. ద్వేషాలతో ఈరోజు సెప్టెంబర్‌ 1న వరల్డ్‌ వార్‌ స్టార్టయింది. సెప్టెంబర్‌ 2న 1945న వరల్డ్‌వార్‌ ముగిసింది. ప్రపంచ యుద్ధం ముగిసి 70 ఏళ్లవుతుంది. దేశాల మధ్య కంచె వేసుకుంటున్నారు. అలాగే మనుషులకు, మనసులకు మధ్య కూడా కంచె వేసుకుంటున్నారనే మాక్రో, మైక్రో పాయింట్‌పై సినిమాని తీశాను.బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి. ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సెప్టెంబర్‌ 12న ఆడియో, అక్టోబర్‌ 2న సినిమా రిలీజ్‌ ఉంటుంది''అన్నారు. ‘కంచె’ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది  – హీరో వరుణ్ తేజ్       వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ''క్రిష్ గారు కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అయితే లోపల ఇదొక పీరియడ్‌ ఫిలిం, 1940 బ్యాక్‌డ్రాప్‌ ఎలా వస్తుందోనని చిన్న భయం ఉండేది. కానీ రీరికార్డింగ్‌ సమయంలో సినిమా చూశాను. ఎక్‌ట్రార్డినరీగా వచ్చింది. మా రెండు గంటల సినిమా ఎలా ఉంటుందో చెప్పే చిన్న ఎగ్జాంపిలే ఈ ట్రైలర్‌. క్రిష్‌ నుండి ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు. Great Response For Varantej Kanche Trailer!!
> >
Great Response For Varantej Kanche Trailer!!

Great Response For Varantej Kanche Trailer!!

Posted on: Sep 03, 2015

'కంచెట్రైలర్‌ విడుదల

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు.  ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 1, మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, మెగాబ్రదర్ నాగబాబు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం ఏర్పాటైన సమావేశంలో....

 గమ్యం తర్వాత నేను చేసిన గొప్ప కథ కంచె- క్రిష్ జాగర్లమూడి                
డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి మాట్లాడుతూ ‘’ఒక కథను చెప్పాలంటే బలంగా చెప్పాలనుకునే వ్యక్తిని నేను. ఓ కథను రాసుకోవాలంటే కొంత టైమ్, తీయడానికి మరికొంత టైమ్ పడుతుంది. అలాగే కథను నేను దాదాపు మూడు సంవత్సరాలుగా క్యారీ చేశాను. ప్రపచంలో జరిగిన గొప్పయుద్ధాల్లో గొప్పది రెండో ప్రపంచ యుద్ధం కానీ 75 సంవత్సరాలుగా ఇటువంటి కథతో తెలుగు, తమిళంలో సినిమాలు రాలేదు. ఈ కథ రాసుకున్నప్పుడు ఎవరూ ఈ విధంగా పెర్‌ఫార్మన్స్‌ చేస్తారోనని అనుకునేవాడిని. ఎందుకంటే హీరో సోల్జర్‌గా ఉండాలి. అమాయకత్వంతో, తెలియని తెంపరితనంతో కూడుకుని ఉండాలి. 1936లో చెన్నపట్నంలో చదువుకున్న విద్యార్థిలా ఉండాలి. కానీ దేవుడి దయ, ప్రకృతి అంతా కలిసి నాకు ఇవ్వడమో ఏమో కానీ కథకు కావాల్సినవన్నీ ఆటోమెటిక్ గా సమకూరాయి. బడ్జెట్, హీరో, హీరోయిన్ ఇంకేదైనా కావచ్చు. ఈ సినిమాని నిడిని రెండు గంటల ఐదు నిమిషాల సినిమా. గమ్యం తర్వాత గొప్ప కథ నాకు దొరికింది. దాన్ని బాగా ఎగ్జిక్యూట్‌ చేశామని అనుకుంటున్నాం. చాలా సంవత్సరాలు తర్వాత థియేటర్స్ కి బాహుబలి వల్ల ఆడియెన్స్ బండ్లు కట్టుకుని వస్తున్నారు. ఆ తర్వాత  శ్రీమంతుడు కూడా పెద్ద హిట్టయింది. అదే కోవలో మా కంచె సినిమా కూడా చేరాలి. ద్వేషాలతో ఈరోజు సెప్టెంబర్‌ 1న వరల్డ్‌ వార్‌ స్టార్టయింది. సెప్టెంబర్‌ 2న 1945న వరల్డ్‌వార్‌ ముగిసింది. ప్రపంచ యుద్ధం ముగిసి 70 ఏళ్లవుతుంది. దేశాల మధ్య కంచె వేసుకుంటున్నారు. అలాగే మనుషులకు, మనసులకు మధ్య కూడా కంచె వేసుకుంటున్నారనే మాక్రో, మైక్రో పాయింట్‌పై సినిమాని తీశాను.బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి. ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సెప్టెంబర్‌ 12న ఆడియో, అక్టోబర్‌ 2న సినిమా రిలీజ్‌ ఉంటుంది''అన్నారు.

కంచె ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది  – హీరో వరుణ్ తేజ్      

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ''క్రిష్ గారు కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అయితే లోపల ఇదొక పీరియడ్‌ ఫిలిం, 1940 బ్యాక్‌డ్రాప్‌ ఎలా వస్తుందోనని చిన్న భయం ఉండేది. కానీ రీరికార్డింగ్‌ సమయంలో సినిమా చూశాను. ఎక్‌ట్రార్డినరీగా వచ్చింది. మా రెండు గంటల సినిమా ఎలా ఉంటుందో చెప్పే చిన్న ఎగ్జాంపిలే ఈ ట్రైలర్‌. క్రిష్‌ నుండి ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

Comments